Monday, March 27, 2023

 https://youtu.be/ey0p7_m3aXE


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:దర్బార్ కానడ


కేశవా మాధవా వేంకట నారాయణా

గోవిందా ముకుందా హే పరమానందా

మూడునామాలతో ముదమును గొలుపువాడ

ఏడుకొండల మీద చెలగీ వరలెడువాడ

మముకాచెడి ఆపదమొక్కులవాడా

దండాలు దండాలు అడుగడుగూ దండాలవాడా


1.తలనీలాలనైతె ముడుపులు గొంటావు

మావెతలను సుతరామూ పట్టించుకోవు

మొక్కులెన్ని మొక్కినా లెక్కనే చేయవు

మాచిక్కులు తొలగించగ మనసే పెట్టవు

ఓపికే సడలింది నిను బతిమాలి బామాలి

ఇప్పటికిప్పుడే ఇభవరదా తాడో పేడో తేలాలి


2.హుండీలు నిండినా మా కాన్కలతో మెండుగా

మేం గండాల పాలబడితె నవ్వుతావు మొండిగా

గుంజీలు తీస్తాము నీముందు లెంపలేసుకుంటాము

తప్పులు ఒప్పుకొని మమ్ముల మన్నించమంటాము

ఎందరెందరిని ఆదుకొన్నావో ఇందిరా రమణా

నీవు దప్ప దిక్కులేదు మాకిక కరుణాభరణా

No comments: