Monday, March 27, 2023

 https://youtu.be/j7_Y09-nqOI


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:హిందోళ వసంతం


బ్రహ్మీ ముహూర్త కాల స్వప్నము

అవుతుందట సదా శివా సత్యము

నీ ఆనుజ్ఞతోనే కదా ప్రతి కృత్యము

ఋజువుపరచు మహేశా నీ మహత్మ్యము


1.గాడి తప్పిన నా బండి దారికి మళ్ళిందట

చేజారిన మణిపూస మరలా దొరికిందట

నే వెదికే వనమూలికతీగ కాలికే తగిలిందట

మూగవోయిన నాగొంతు రాగాలు పలికిందట

ఊహ ఐతె మాత్రమేమి తలపే ఎంతహాయి

వాస్తవంగ మార్చివేస్తూ వరమే నా కిచ్చివేయి


2.కరిగిపోయిన మంచికాలం తిరిగి వచ్చిందట

కూలిపోయిన ఆశాసౌధం దానికదే నిలిచిందట

తెగిపోయిన స్నేహబంధం చిగురించిందట

తరలిపోయిన బ్రతుకు వసంతం తానే మరలిందట

కల్పనే కలిగిస్తోంది అంతులేని ఆనందం

అనల్పమే నీ మహిమ నీకేదీ అసాధ్యం

No comments: