Wednesday, March 8, 2023

 https://youtu.be/CyTcqVJriNQ


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:ధర్మవతి


ప్రదర్శించు సాయి నీ-అపూర్వ మహిమలని

ప్రకటించు నా వెతలను తీర్చి బాబా నీ లీలని

ఋజువులేక నమ్మలేను నీ ఉనికిని

చెబితే పొందలేను నీవున్న అనుభూతిని

భవభూతినికాను నేను ఆషాఢభూతిని

దివ్యానుభవమెరుగనైతి నే మూఢమతిని


1.వేవేలమందిరాలు నీకుంటేనేమి

కోట్లాది వ్యక్తులు నిను కొలుచుకుంటె మాత్రమేమి

ఊరూరా నీభజనలు మారుమ్రోగినా సరే

ఎవరెంత చెప్పినా నాదిమనసొప్పని తీరే

భవభూతినికాను నేను ఆషాఢభూతిని

దివ్యానుభవమెరుగనైతి నే మూఢమతిని


2.దృష్టాంతరాలెన్ని గ్రంథస్తమైతెనేమి

కష్టాలు తీరిపోయి ఎందరో గట్టెక్కినా గాని

త్రికరణశుద్ధిగా నిను విశ్వసించు వారున్నా సరే

నా సంగతి వచ్చు సరికి సాయి మారదాయె నీతీరే

భవభూతినికాను నేను ఆషాఢభూతిని

దివ్యానుభవమెరుగనైతి నే మూఢమతిని

No comments: