https://youtu.be/mQewJLr5uy0
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
రాగం:మధ్యమావతి
పరమదయాళువు నీవు వీర రాఘవా స్వామీ
తిరువళ్ళూరు తిరవాసా నీకు నమోనమామి
పద్మనాభ పురుషోత్తమ పాహి ఫణిపతి శయనా
ఆయురారోగ్య వరదా దేహిమే సూర్యచంద్ర నయన
1.నినునమ్మి కొలిచితె చాలు సమసేను దీర్ఘవ్యాధులు
నిను మది తలచితె చాలు తొలగేను మనోరుగ్మతలు
సకలరోగ ఔషధాలు నీ చెంతన సులువుగా లభ్యము
మా చింతలు దీర్చే చింతామణి నీవన్నది సత్యము
2.వసుమతి నామాంతర కనకవల్లి ప్రియపతివి
వైద్య వీర రాఘవమూర్తిగా వరలు విష్ణుమూర్తివి
శాలిహోత్రమహాముని తపఃఫలాన ఇలవెలిసితివి
పరిమళ తైలాభిషేక అభిలాషివి క్లేశనాశి పెరుమాళ్ళవి
No comments:
Post a Comment