Thursday, February 2, 2023

 https://youtu.be/gE227kQLKbU


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:దర్బార్ కానడ


స్వరములు ఏడే సరిగమపదని

పంచుతాయి వీనుల విందగు సుధని

ఎదలకందించుతాయి ఆహ్లాద మధురిమని

ఆలపించినా ఆలకించినా గానం ఉభయతారణి


1.అలసిన మేనుకు వింజామర పాట

విసుగు చెందియున్నవేళ మదికూరట

ఎడారి దారులలో ఎదురయే తేనె ఊట

ఏకాకి జీవితాన ఏకాంతవాసాన నేస్తమంట


2.కాలిన గుండెలకు హాయగు నవనీతం

  మండే వేసవిలో తుషార జలపాతం

వసంత యామినిలో మంజుల మారుతం

నలతల కలతల నోకార్చే ఔషధం గీతం

No comments: