https://youtu.be/N2mHvgQu4p0?si=39NOM6ieZg0IMVND
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
రాగం :హంసానంది
సప్త మాతృకా స్వరూపిణి
పంచమ అవతారిణి భవతారిణి
భవబంధ మోచని వారాహీ జనని
మంత్ర తంత్ర యంత్ర సాధన సంతోషిణి
వందే కామరూపిణి శరణు శరణు దుష్ట దమని
1.కృష్ణ వర్ణ తేజో ప్రకాశిని వరాహానని
అష్ట భుజి అష్ట కష్ట దుఃఖ ప్రశమని
కాశీ పుర వాసిని ఉగ్ర వారాహీ నామకీ
అనుగ్రహించవే శ్రీ లలితా దండ నాయకీ
2. నిశి పూజా ప్రియే దేవి నిశిత బుద్ధి దాయిని
అంధకాసుర హంతకీ రక్తబీజ దైత్య హనని
శాక్తేయ విధి సాధక తాంత్రిక పరిపాలిని
గుప్త నవరాత్రోత్సవ దేదీప్యమాన విరాజినీ
No comments:
Post a Comment