Friday, June 13, 2025

 https://youtu.be/moAraBHFl2w


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:ఉదయ రవిచంద్రిక


సాత్విక రాజస తామస గుణాధీనులు -లోకములో సకల జనులు

సహజాతముగానే త్రయీ గుణ ప్రభావితములు-శ్రద్దా విశ్వాసయుత మానసికములు

కర్మ ఏది చేసినా ఫలితములన్నీ త్రిగుణాన్వితములు

యజ్ఞ తపో దానములందును గుణత్రయాలు -నిత్యత్వములు


1.ఆహార విహారాదులూ గుణత్రయ సంయుతములు

సాత్వికారాధకుల దైవాలు ముక్కోటి దేవీ దేవతలు

రాజస మనుజులకు పూజార్హులు ఇల యక్ష రాక్షసులు

తామసోపాసకుల కొలుపుల కొరకు భూతప్రేత గణములు


2.శాస్త్రవిధి సమ్మతమై ఫలాపేక్ష రహితమైనదే సాత్విక యజ్ఞము 

కామేష్టిగా గర్విష్ఠిగా పటాటోపముతో ఒనరించేదే రాజస యజ్ఞము 

మొక్కుబడిగా తడబడుతూ యధేచ్చగా జరుపబడేది తామస యజ్ఞము 

సర్వోత్కృష్టమే యజ్ఞ క్రతువైనా అది గుణత్రయాతీతమగుట సత్య దూరము 


3.మనోవాక్కాయకృతమైన త్రయీమయ తపస్సులూ త్రిగుణ సంపన్నములు 

శ్రద్ధాసక్తులతో విశ్వాసముతో ప్రతిఫలమాశించక సలిపేవి సాత్విక తపస్సులు 

డాంభిక దర్పములతో కీర్తికాంక్షతో ఆచరించు తపములు రజోగుణ రుచస్సులు

క్షుద్ర సాధనతో బలుల సమర్పణ ఆత్మార్పణతో చేసే భూత సంప్రీతులు నిజ తమస్సులు


4.విధినిర్వహణగా ఎంచి నిష్కామనగా నొనరించిన గుప్తదానము సాత్వికము

విధిలేక ఇచ్చెడి విరాళము పేరునెరుకపరచు విధానము రాజస గుణము

విదిలించెడి తీరుగా తన పాపములు తీరగ వేసే బిచ్చము తామసిక దానము

ఉన్నప్పుడు ఇచ్చేది ఉన్నంతలో ఇచ్చేది ఉన్నదంతా ఇచ్చేది దాన గుణత్రయ సోదాహరణము



No comments: