Saturday, July 18, 2009

తెంచుకుంటె తెగిపోయే బంధం కాదు
పారిపోతె వదిలేసే పాశం కాదు
స్నేహ పాశము-అనురాగ బంధము
1. తెరవేస్తే మరుగయ్యే దృశ్యం కాదు
తెలివొస్తే కరిగేటి స్వప్నం కాదు
జీవ చిత్రము-ఇది నగ్న సత్యము
2. మందువేస్తె మానేటి గాయం కాదు
పంచుకుంటె తీరేటి వేదన కాదు
నా మనోవేదనా- ఈ నరక యాతన
3. నా మార్గమెన్నటికీ పూలబాట కాదు
నా పయనానికి గమ్యంలేదు
అంతులేని పయనం-ఆగిపోని గమనం

2 comments:

Padmarpita said...

Nice.....

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

మీ వెనువెంట స్పందన నాకెంతో నచ్చింది!
మీ గురించి,మీ బ్లాగుల గురించి మీ వైఖరులు అభిరుచుల గురించి తెలుసుకోగోరుతాను ...అభ్యంతరం లేకుంటేనే!
సదా మీ
స్నేహాభిలాషి
రాఖీ