Thursday, July 30, 2009

నే మనసిచ్చినా ఒక చిన్నది
నా ప్రేమనే కాదన్నది
మనసేమిటో మనిషేమిటొ
ప్రేమేమిటొ మనువేమిటొ
అసలే ఎరుగని ఆ చిన్నది-నన్నే కాదన్నది

1. ఏ తోటలోనున్నా చెలి పాటే పాడేను
ఏ చోట నేనున్నా  నా ప్రేయసిని కంటాను
దయలేని నా చెలీ అందాల కోమలీ
 తలచి తలచి  వలచి వగచే నాపై కోపమేలనో 

2. చెలి కొఱకె నా వలపు-తెఱిచాను ఎద తలుపు
మనసెరిగి తీయని పలుకు-ఏనాటికైనా తెలుపు
ఎన్నాళ్ళు అయినాగాని-ఎన్నేళ్ళు అయినాగాని
దిగాలునే యుగాలు వేచే అనురాగం నాదేలే 

3. చెలికోసమే నా ప్రాణము-చెలిమీదనే నాధ్యానము
చెలి లేని నా జీవితం-వలదన్న దుర్దినం
మల్లెలు విరియని-కోయిల కూయని
తిమిర వసంతం-చితికే చేరును ఇది సత్యం 

No comments: