Wednesday, August 5, 2009

కన్నీటి వీడుకోలు
కడసారి అంపకాలు
మది కలచు జ్ఞాపకాలు
చితిమంట నెట్లుకాలు

1. బాల్యాన అనుభవాలు
గారాలు అనునయాలు
వాత్సల్యమే కదా మేరు
అనురాగమే జాలువారు

2. ఆనంద సాగరాలు
కావేల జీవితాలు
విధివింత నాటకాలు
వైషాద పూరితాలు

3. తీరలేని ఈ ఋణాలు
తీర్చేనా మాతృ యజ్ఞాలు
సంతృప్తి ఒకింతైనా చాలు
బ్రతుకులే రవంత సార్థకాలు

No comments: