దూదిపింజలాగ తేలి వస్తావు-గాలివాటుకే వెళ్ళి పోతావు
చుట్టమల్లె నన్ను చూడ వస్తావు-చెప్పకుండ మాయ మైపోతావు
ఓ మేఘమా - జీవన రాగమా
నా దాహమే- తీర్చే స్నేహమా
1. మనసైతే మాత్రము-ఓ చినుకై పలకరిస్తావు
అభిమానం వెల్లువైతే-తొలకరినే చిలకరిస్తావు
ఎదనదులకు జీవం నీవు-ప్రేమికులకు ఊతం నీవు
అంతరంగ గగనానా-అందమైన సుందరి నీవు
అనురాగ సీమలోనా-ఆరాధ్య దేవతవీవు
2. కాళిదాసు నిన్ను చూసి-కావ్యమే రాసాడు
తాన్ సేన్ తాళలేక-రాగమే తీసాడు
కవి కవితకు వస్తువు నీవు-గీతకర్త స్పూర్తివి నీవు
చిత్రమైన ఆకృతులెన్నో-సంతరించుకుంటావు
కొత్త కొత్త ఆ కృతులెన్నో-ఆవిష్కరిస్తుంటావు

2 comments:
baagundi chalaaa
thnx manjugaaru..
Post a Comment