https://youtu.be/kiaKS3lA6Ig?si=Yyht1iioIfkoYGIs
ధర్మపురి నృసింహా-దయాపూర్ణబింబా
స్తంభ సంభవా స్వామీ వందనాలయా
జ్వలితనేత్ర నీకివే చందనాలయా
1.వైశాఖ శుద్ధ చతుర్దశి-గోధూళిశుభ ఘడియలలో
ప్రహ్లాదునిగావగ నీవు ఆవిర్భవించితివయ్యా
కరినగరం జిల్లాయందు-గోదావరి తీరమునందు
భవ్యమైన యోగ ముద్రతో ధర్మపురిన వెలసితివయ్యా
ఎదనివేదనలనందుకొనిమా వేదనలను తీర్చవయ్యా
2.ఫాల్గుణ శుద్ధ ద్వాదశినాడు-కళ్యాణమాడుతావు
హోళీనపుష్కరణియందున-డోలాల నూగుతావు
ధర్మసంస్థాపన జేయుచు ధర్మపుర వీధులయందు
పంచమీపర్వదినాన-రథమున ఊరేగుతావు
రెండు కళ్లు చాలవయ్యా నీ విభవము కనితరియించ
3.ధనుర్మాస ఏకాదశిన -వైకుంఠ దర్శనభాగ్యం
వైశాఖ ఏకాదశిన-అద్భుతమే చందనోత్సవం
కార్తీకపౌర్ణమి రోజున-కాంతులీను దీపోత్సవం
మాఘశుద్ధ పంచమినాడు-అలరించు వసంతోత్సవం
ధర్మపురిన నిత్యమూ కళ్యాణ వైభవమే-జాతరాసంబరమే
1 comment:
రాఖీ గారు మీ బ్లాగును సరిక్రొత్త అగ్రిగేటర్ కూటమి లో జత చేయడం జరిగినది చూసార!********************************************** http://www.kootami.co.cc
Post a Comment