Friday, July 12, 2013

రాఖీ|| రెప్ప పాటే జీవితం ||


రాఖీ|| రెప్ప పాటే జీవితం ||
రెప్ప పాడెను జోల పాట
నిదుర పొమ్మని కలల కౌగిట
అలసి సొలసిన ఎదకు ఊరట
ఆవులింతకు తావు లేదిట
1.    హాయి కొరకు రేయి వరకు
తల్లడిల్లిన తనువు తపనకు
విశ్రాంతి కొరకు పడక చెంతకు
పరుగులెత్తే చిత్త చింతకు
ఆదమరువగ సేద తీరగ
బజ్జో బెట్టి జోజ్జో కొట్టగ
2.    తిరిగి రాని  గతము గతమే
రూపు లేనిది రేపే మాయే..
కరుగనీయకు మధుర క్షణము
కునుకు  గలిగిన కన్నులె వరము
అహము ఇహము మరువు దేహము
స్వర్గ ధామము స్వప్న లోకము


1 comment:

Unknown said...

బాగా రాశారు!రెప్పపాటే జీవితం కునుకు కలిగిన కనులే వరము!కరుగనీయకు మధుర క్షణము!insomniaజీవులకు అసూయకలిగించి ఆరాటం పుట్టించేటట్లు బాగారాశారు!