రాఖీ||మృతి లేని
స్మ్రుతి..||
తప్పదింక వీడుకోలు...
తప్పవు ఎడబాటు సెగలు..
వదిలివెళ్ళు..మిత్రమా..జ్ఞాపకాలనైనా
మోసుకెళ్ళు
నేస్తమా..తీపి గురుతులైనా..
1. కలిసి ఉన్న ఇన్నాళ్ళు
విలువ తెలుసు కోలేదు..
మా మధ్యే తిరుగుతున్నా
మహిమను గుర్తించ లేదు
చే..జారి పో..యిన
మణిపూసవే నీవు
కన్నుమూసి తెరిచేలోగా కనుమరుగౌతున్నావు
వదిలివెళ్ళు..మిత్రమా..జ్ఞాపకాలనైనా
మోసుకెళ్ళు నేస్తమా..తీపి గురుతులైనా..
2.
పట్టు బట్టి వెంట బడ్డా
మేమూ పట్టించుకోలేదు
ఎగతాళిగ పరిహసించినా
నీ చిరునవ్వు మాయలేదు.
చేయనీయి నేస్తమా మా కన్నీటి సంతకాలు
మన్నించు
మిత్రమా మా పొరపాట్లు తప్పిదాలు
మిగుల్చుమా ..మిత్రమా..అనుభూతుల నైనా
తీసుకెళ్ళు ..నేస్తమా..అనుభవాల నైనా....
No comments:
Post a Comment