Saturday, August 2, 2014

మైత్రీ బంధము



03-08-2014-మైత్రీ దినోత్సవ శుభాభినందనలతో...రాఖీ-9849693324.

మైత్రీ బంధము -మానవతకె అందము
ఒకరికొరకు ఒకరైన చందము
ప్రతి జ్ఞాపకం ప్రతి అనుభవం పరమానందము

1.       రాముడు సుగ్రీవుడు రాచబాట వేసినారు
కృష్ణుడూ కుచేలుడూ అంతరాలు మరచినారు
సుయోధనుడు కర్ణుడు ఒకే ఆత్మ అయినారు
స్నేహితమే మహితమని చరితార్థులైనారు

2.       తెలిసీ తెలియని పసితనాన  సోపతి
ఎదిగే వయసులోన ఎల్లలెరుగనీ చెలిమి
బాంధవ్యాల కన్న మిన్న యైనదే స్నేహము
వేదనలో మోదములో స్మృతి మెదులును నేస్తము

3.       ఆర్థిక గణాంకాలు కొలవలేని పెన్నిధి
జాతిప్రాంత కులమతాల కతీతమీ సన్నిధి
రూపురేఖ లెంచనీ విలువైన దోస్తీ ఇది
ఎంతమంది ఎక్కినా మునగని షిప్పిది - ప్రెండ్ షిప్ ఇది

No comments: