Saturday, April 15, 2017


https://youtu.be/OCgeEYGSQzc

మహిలోన మహిమాన్విత చరిత మహిళది
ఇలలోన కొలవలేని ఘనత ఇంతిది
త్యాగానికి రూపమై
ధైర్యానికి దీపమై
అడుగడుగున వెన్నంటి నడిపించే నేస్తమై
పదపదమున ఎదపంచి ప్రేమించే ప్రాణమై
మగవాడికి మనుగడ మగువ
పురుషుని పుణ్యఫలం పడతి

1.అమ్మగా ప్రేగు పంచి,కమ్మగా పాలుపంచి
కంటికిరెప్పలా భావించి,అనురాగాల పలికించి
సంతానమే తన సర్వస్వమని తలంచి తపించి పోతుంది తరుణి
తనయగా బాధ్యతమోసి,ఇంటికే కాంతులు పూసి
సంతోషాల జల్లుకురిసి,నవ్వులెన్నొవెదజల్లి
పుట్టినిల్లు సొంతమని సోదరులే సాంతమని
మురిసి మురిసి పోతుంది ముదిత

2.నారిని సారించి నరకాసురుసంహరించి
లోకాలచీకట్లకు దీపావళి వెలిగించి
తలమానికమయ్యింది నారీమణి సత్యభామ
యమరాజుకు ఎదురొడ్డి వాదనతో మెప్పించి
పట్టుదలకు ప్రతీకగా పతివ్రతల ప్రతినిధిగా
పతిప్రాణము సాధించిన ధీరవనిత సావిత్రి

3.ఎవరెస్టు నధిగమించి అఖాతాల నీదులాడి
రోదసీ సీమలలో పతాకాల నెగురవేసి
శాస్త్ర సాంకేతిక రంగాల ఖ్యాతినందె రమణి
 తనువులోన తను సగమై మగనికి తా జగమై
గృహిణిగా ఇంట గెలిచి,ప్రధానిగాను పాలించి
క్రీడల్లో సైతం తన సత్తా చాటుతోంది సుదతి

No comments: