Saturday, April 15, 2017

"సమసమాజం"

కులమెంత వ్యాకులమీ దేశంలో     
మతమెంత మౌఢ్యమీ లోకంలో     
పునాదులే వదిలేసిన గాలిమేడలు
అనాదిగా చెలరేగిన చితిమంటలు

చేతనైన పనిచేయగ
నైపుణ్యం వంటబట్టి
ఒకే తత్వమున్న జనులు
పరస్పరం ఊతమిచ్చి
ప్రత్యేక వృత్తుల ప్రవృత్తితో
ఏర్పడ్డ తెగలను కులమంటే
పుట్టుకెలా ఔతుంది కారణం
మర్మమెరుగ లేకనే
కులాల సంకుల సమరం

తోచినటుల ధ్యానించగ
నచ్చినటుల స్ఫురించగ
ఏర్పడ్డ భావాలకు
ఏదోఒక రూపు నిచ్చి
అనుయాయులు నడయాడగ
అభిమతమే మతమంటే
ఆబోధలననుసరిస్తె చిక్కేలేదు
బలవంతపు మతమార్పుకు
ప్రలోభాల బారిన చిక్కేది లేదు


No comments: