Wednesday, June 14, 2017

శుభోదయం! మొక్కవోని ప్రయత్నమే విజయం!!

ఒక నవ్వు నవ్వితే చాలురా
వరహాలు ముత్యాలు రాలురా
ఒకచూపు చూస్తే చాలురా
వేవేల వెన్నెల్ల జల్లురా

1.ఒక ముద్ద మింగితే చాలురా
నాకడుపుసైతం నిండురా
ఒక గుటక నీళ్ళైన తాగురా
లేకున్న  'కన్నా' గొతెండురా

ఒక పలుకు పలికితే చాలురా
తేనెల్లు ఏరులై పారురా
ఒక పాట పాడితే చాలురా
కోయిలే తలవంచి నిల్చురా

2.సొంతంగ మనగలుగు చాలురా
కోరేది మరిఏది లేదురా
కలివిడిగ కదలాడు చాలురా
కనగలుగు కల ఏది లేదురా

పిడికిలే బిగియించి మోదరా
కొండలే పిండిగా మారురా
ఒక అడుగు వేస్తే చాలురా
గమ్యాలు నీముందు వాలురా

3.యత్నిస్తె పోయేది లేదురా
ఎద దమ్ము దుమ్మింక తొలగురా
గురి పెడితె సరినీకు లేదురా
విజయాలు నిన్ననుసరించురా

No comments: