Wednesday, June 14, 2017

నక్షత్ర(27 వ)వసంత వైవాహిక దినోత్సవ అనుభూతులతో...రాఖీ గీత!!

తరగని ప్రేమ ఇది
చెరగని బంధమిది
జన్మజన్మాలది
ఆత్మగతమైనది

1.మూడుముళ్ళ కటిక ముడి
ఏడడుగుల కఠిన నడవడి
అలరించెను బ్రతుకు ఒరవడి
అలవోకగ సాగ పదపడి

దాంపత్యపు సత్యమిది
ఒడుదుడుకుల తత్వమిది
రాగ మోహాలది
దేహ దాహాలది

2.గుట్టు దాచ మూసిన గుప్పిటి
పట్టు విడుపు నేర్చిన పోటి
ఆలుమగల అలకల ధాటి
అనురాగము కేదీ సాటి

సంసారపు సారమిది
సహవాసపు గంధమిది
అనుపమాన సౌఖ్యమిది
అద్వితీయ హాయి ఇది

No comments: