https://youtu.be/EuxGq641WxI?si=Wj69p9YFrANOEEbt
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
రాగం: ఉదయ రవిచంద్రిక(శుద్ధ ధన్యాసి)
ధర్మపురీ ,శ్రీ లక్ష్మీ నరసింహుని దివ్య క్షేత్రము
ధర్మపురీ,గోదావరి ప్రవహించే పుణ్య తీర్థము
కర్మలు నశియింప జేయు సన్నిధానము
జన్మను తరియి౦పజేయు ముక్తి ధామము
1.దక్షిణ వాహిని గా అలరారే గోదావరి ఒక వరము
దక్షిణ కాశీ గా వాసికెక్కి యున్నదీ ఈ పురము
దక్షిణ దిక్పతి నెలకొని యున్న స్థలము
దక్షిణ భారతాన ప్రసిద్ధ యాత్రాస్థలము
2.వేదాలకు నెలవైన విప్రవరుల నిలయము
సంస్కృతీ సనాతన సంప్రదాయ సహితము
సంస్కృతము జ్యోతిష్యము సమకూరి యున్నది
సంగీతము సాహిత్యము సకల కళల పెన్నిధి
3.శివకేశవులభేదమైన హరిహరక్షేత్రము
పరమత హితమెరిగిన మహిత స్థావరం
నిత్యమూ భక్తులతో అలరారే జనపదము
ప్రతిరోజు పండగనే తలపించే ఒకజగము
No comments:
Post a Comment