Wednesday, December 13, 2017

చెరగనీకు పెదవులపై
చంద్రవంక చిరునగవు
చేయబోకు ఎడదనెపుడు
వెతలకింక తావు

ఆటుపోట్ల తాకిడికి
వెరవబోదు రేవు
కలతలు కన్నీళ్ళు
కలకాలం మనలేవు

1.ఎండకైన వానకైన
కొండ చెక్కుచెదరదు
తనగొంతు ఎండినా
ఎడారింక బెదరదు

రేయైనా పగలైనా
నదీ నడక నాపదు
ఋతువులెన్ని మారినా
చెట్టు ఎపుడు జడవదు

2.బతుకు చిటికెడైనగాని
బుడగకింక పంచదా
తలకుమించు బరువైనా
చీమకు తలవంచదా

గెలుపు ఎంత గొప్పదైన
మోడి(పట్టదల)ముందు ఓడదా
ప్రేమ తో జతకడితే
హాయివంత పాడదా

No comments: