Saturday, April 27, 2019

ఎలా దాచిఉంచావో గొంతులొ హాలహలం
ఎలా భరిస్తున్నావో కంటిలొ ప్రళయానలం
బుసకొట్టే విషనాగులె నగలంట
చితికాలిన విభూతియే మేనంతా
కాలకంఠ కాసింత కనికరించరా
జ్వాలనేత్ర రవ్వంత కరుణించరా

1.శ్మశానంలొ ఉంటావు పుర్రెలోన తింటావు
అఘోరాలగురువై అలరారుతుంటావు
సన్యాసివనలేను సంసారిగ ఎనలేను
పరిశీలచేసినను ఎంతకూ గ్రహించనైతి
మదనారి ఇసుమంత దయజూడరా
జడదారి క్రీగంట ననుజూడరా

2.చూడబోతె సతులిద్దరు వీరులైన సుతులిద్దరు
పట్టించుకుంటావో పట్టనట్టుంటావో
మాయకులోబడితివో మాయకే మాయనీవొ
తరచితరచి చూసినా తత్వమెరుగనైతిని
జంగమయ్య నన్నొకింత కృపజూడరా
సిద్ధయోగి సత్వరమే నను బ్రోవరా

3.కఫమునిండె నాగళమున నిను స్తుతిచేయనీదు
కన్నులందు భగభగ దనివారగ నిను చూడనీదు
నీ చలవ వల్లైతే తప్పును సవరంచరా
నాచిత్తవృత్తిదైతె బుద్దినిపుడె సరి దిద్దరా
వైద్యనాథ దీననాథ నా ఔషధమీవేరా
మృత్యుంజయ పాహిపాహి  ఆరోగ్యమునీయరా

No comments: