https://youtu.be/eYLuGQovBhs?si=PLDnK02fLK-hce7B
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
రాగం : సారంగ తరంగిణి
రాధ :
మురళిని నేనౌతా మోహన మురళిని నేనౌతా
నీ పెదవుల మధువులు గ్రోలగ
లాలించరా మురిపాల తేలించరా
మ్రోయించరా తపనలు తీర్చరా
సారంగ తరంగిణుల నొలికించరా
కృష్ణ :
రవళిని నేనౌతా నీ అందెల రవళిని నేనౌతా
నీ పదముల పదనిస లలరగా
పాలించవే నను పరిపాలించవే
నీ ఒడిలో బడలిక మరవగ
స్పర్శించవే మేనంత స్పృశియించవే
కృష్ణ :
దేహము రాధగ ఈ మాధవు భావము
గోవిందుడే ఆత్మగ రాధికా నీ జీవము
అద్వైతామృతం మన సంగమ జనితము
రాధా కృష్ణ-కేళీ విలాసము-సదా సరస భరితము
రాధ :
క్షీరభాండ ప్రియం,-పూతన ప్రాణహారిణమ్
యదుకుల జనరంజకం ఆనంద వర్ధనమ్
గోకుల గోపికా మానస సంచారిణమ్
మీరా హృదయ బృందావన విహారిణమ్
No comments:
Post a Comment