Saturday, April 13, 2019

మంచుకొండ శివయ్యా
జాలిగుండె నీదయా
మండుకన్ను రుద్రయ్యా
నువు దండివాడవేనయా
పుట్టక చావు అంతా నీ మాయ
ఏమీ ఎరుగనట్టు ముక్కుమూసుకుంటావయా

1.ఇల్లేమో శ్మశానం-ఒళ్ళంతా శామీలం
నగలు పన్నగాలు-నడుముకు పులితోలు
పగటి వేషగాడివయా-నిత్య బిచ్చగాడివయా
కుబేరునికె దాతవయా-విశ్వానికె నేతవయా
ఆపద సంపద నీమాయ
ఏమీ ఎరుగనట్టు గమ్మున ఉంటావయా

2.ఆలేమో భద్రకాళి-నీవేమో మల్లారి
సంతతేమొ శూరులైన షణ్ముఖుడు గణపతి
తలమానికమే శశి నెత్తిన భాగీరథి
తడుపగ మురిసేవయా తపనల తీర్చేవయా
అనురాగము అనుబంధము అంతానీ మాయ
ఏమీ పట్టనట్టు తపము చేసుకొంటావయ

No comments: