Saturday, October 12, 2019


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:మధుకౌఁస్(చంద్ర కౌఁస్)

లక్ష సింహముఖీ మహాదేవీ
లక్ష్యము నెరవేర్చే ఆదిపరాశక్తీ
ప్రత్యక్ష దేవతవే ప్రత్యంగిరాదేవీ
రాక్షస సంహారిణీ నమోస్తుతే శుభకారిణీ

1.మానస సరోవరతీరాన
కృత్యగా ప్రకృతిరూప నిత్యగా
అయ్యావరే అడవిలోన
నికుంభిలగా సత్య శాంభవిగా
అష్టలక్ష్మి ఆలయ చేరువలో
కుర్తాళపీఠాన మాతా ప్రత్యంగిరగా
వెలసినావు నీ మహిమలు తెలియపరుచగా
కలిలోన నీ లీలలు ఎరుక పరుచగా

2.యంత్ర తంత్ర మంత్రాత్మికా
రజోగుణ తేజోమయి శివాత్మికా
ఏల్నాటి శనిదోష పీడా పరిహారికా
అభయంకరి అథర్వణ భద్రకాళికా
చంద్రఘంట నామాంతర ఉగ్ర దీపికా
సకలదేవతారాధిత చండ ప్రచండికా
ఆరోగ్యము ప్రసాదించు అపరాజితా
నరదృష్టి హరియించు పరదేవతా

No comments: