Tuesday, March 24, 2020

https://youtu.be/Lm54psMe7Vo?si=Br8WndZhYE6mQGV4

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:మోహన

పరమ దయాళా పరమేశ్వరా
కరుణతొమము కావుమయ్య కాలకాలుడా
మించిపోతున్నది మనగలిగే తరుణం
ముంచుకొస్తున్నది అకాల మరణం
కాలుడే చెలరేగె అన్యధా శరణం నాస్తి
ఈశ్వరా నువు వినా మానవజాతికి స్వస్తి

1.చదువు లేని మూఢులమే మేమందరం
చదువుకున్న మూర్ఖులమే ప్రతి ఒక్కరం
కష్టకాలమందైనా ఇష్టారాజ్యమె మాది
నియమాల నతిక్రమించు నైజము మాది
పనులుచక్కబెట్టమంటె వంకలతో మానేము
ఇంటిపట్టునుండమంటే బేఖాతరు చేసేము
కాలుడే చెలరేగె అన్యధా శరణం నాస్తి
ఈశ్వరా నువు వినా మానవజాతికి స్వస్తి

2.ఆయువు మూడినా అవినీతినొదలము
ప్రళయము కబళించినా నిర్లక్ష్యము వీడము
ఇతరులకన్నా మేమే అతీతమనుకంటాము
చేయిదాటిపోయాకా నెత్తికొట్టుకుంటాము
మా వంకర బుద్ధులింక సరిజేయర శంకరా
మా తింగరి చేష్టలనే అరికట్టర హరహరా
కాలుడే చెలరేగె అన్యధా శరణం నాస్తి
ఈశ్వరా నువు వినా మానవజాతికి స్వస్తి

No comments: