Thursday, May 14, 2020

వెన్నెలే ముద్దగ చేస్తే నీ ముగ్ధరూపం
క్షీరమే ఘనీభవిస్తే నీ మేని తేజం
విద్యను శిల్పీకరిస్తే నీ రమ్య విగ్రహం
కళలనే కుప్పగపోస్తే అదినీ విలాసం

1.రవికి ఎంతో ప్రియం నీ వదనం
శశికి ఇంకా ఇష్టం నీ నయనద్వయం
రతిపతిని అర్చించాలి నీ అధరాలతో
సమరాన పూరించాలి నీశంఖకంఠముతో

2.కేసరి ఆవాసము నీ నడుమే
కలహంసల ఆనవాలు నీ నడకే
కోడెనాగు జాడచూడ నీ వాలు జడలో
మేఘమాల ఏదొ తోచే ముంగురులలో

No comments: