ప్రపంచ సంగీత దినోత్సవ సందర్భంగా-శుభాకాంక్షలతో
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
షడ్జమం సౌరభమందించనీ-రిషభం పరిమళించనీ,
గాంధారం గుభాళించనీ-మత్తేభం మత్తెక్కించనీ
పంచమం పరవశింపజేయనీ,-ధైవతం తన్మయమొందించనీ,
నిషాదం ఖుషీలనే పంచనీ-సంగీత వనంలో మనజీవనంలో
1.మంద్ర మధ్యమ తారా స్థాయిల్లో శ్రుతిపక్వమవనీ
ఆరోహణ అవరోహణ సప్త స్వరముల వరమవనీ
లయ గతి జతి గమకాలు గానమందు వికసించనీ
భావ రాగ తాళాలు మనో రంజకమై మేళవించనీ
2.కర్నాటక హిందుస్తానీ భారతీయ సంగీతం వెలగనీ
విశ్వజనీనమై సంగీతం అనురాగ మొలికించనీ
శిశువులు పశువులు పాములనూ గానం అలరించనీ
సంగీతం సాహిత్యం యుగళమై సర్వదా చెలఁగనీ

No comments:
Post a Comment