రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
ఆ రెండు కళ్ళుచాలు నా గుండె ఆగడానికి
ఈ చిలిపినవ్వు చాలు ఎద తిరిగి మ్రోగడానికి
కంజదళాయతాక్షీ తాళలేను నినుగనక
నా హృదయం ప్రణయం జీవితం నీవే గనక
1.మనిషన్న వాడెవడైనా నీ కనులకే గులాము
కవులందరు చేస్తారు నయనాలకే సలాము
ముందుకెళ్ళలేరెవరూ అందాలు నీకెన్నున్నా
చూపులతో కట్టేసే కనికట్టే నీ ఘనతంటున్నా
1.మీనాలు కలువలు కళ్ళకెన్ని ఉపమానాలు
తూపులు కైపులు చూపుకెన్ని రూపకాలు
రాజ్యమే నాకుంటే చేయగలను పాదాక్రాంతం
ప్రాణం కంటె విలువైందేదీ చేసేసా అదినీ సొంతం
Pic courtesy:fb sharing
No comments:
Post a Comment