Saturday, December 19, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వెలవెల బోతున్నది నెల వెన్నెలా

అలకల చంపకే ఇల నన్నిలా

మిసమిస వన్నెలున్న అన్నులమిన్నా

రుసరుసలేలనే అన్నిట నా కన్న నీవే మిన్నా


1. చక్కని నీ మోముకు నీ నగవే వజ్రాభరణం

చిక్కిన నీ నడుముకు తులము పసిడి వడ్డాణం

పలుచని నీ పాదాలకు పాంజేబులె విన్నాణం

పాలరాతి శిల్పము అంగనా నీ అంగ నిర్మాణం

నీ పొందే బహుజన్మల నా పుణ్య ఫలం

మూతిముడిచి పస్తుంచకు నను చిరకాలం


2.చలిని తరిమికొట్టవె నను కౌగిట బంధించి

నా తాపము తీర్చవే నీ పెదవులనందించి

ఆవురావురంటున్నది నెరవేరగ తనువున తమకం

ఆరాటపడుతున్నది ఐక్యవవగ ఎడద ఢమరుకం

రతిమదనుల గతి సాగెడి సృష్టికార్యముకై

ప్రీతిమీర అలరించవె దృష్టిసారించినాపై

No comments: