రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
(యుగళగీతం)
అతను: గాజుకళ్ళ పిల్లా
నా మోజుతీర్చవెల్లా
పడిపోయా నిను చూసి వెల్లాకిల్లా
ముంచేయకె నంగనాచి ననునిలువెల్లా
ఆమె: చొంగకార్చు బావా
ఎప్పుడూ నీకదే యావా
మనువయేదాక ఆ మాత్రం ఆగలేవా
అంతలోనె మతిమాలుతు ఇంతటి కరువా
అతను:1.తిప్పుకుంటు తిరుగుతుంటె
ఎవరైనా చప్పున పడిపోరా
చుప్పనాతి బుంగమూతి మొహందాన
సూదంటు రాయంటి సోకుదాన
ఆమె: ఉత్తినె ఊరిస్తే ఉరికొస్తావు
చనువిస్తే కాస్త సంక నెక్కుతావు
ఏదో పాపం పోనీ లెమ్మంటే
పోకిరోడా నా ఎదనే దో చేసేస్తావు
అతను:2.నాటకాలంటేనే నాకెంతకు పడవే
తాయిలాలిస్తె నువ్వస్సలు పడవే
నడపవె చుక్కానివై నా బతుకు పడవే
తింగరి బుచ్చి నాపై ఏల మనసు పడవే
ఆమె: లగ్గమింక చేసుకో తిరకాసు బావ
పగ్గాలింక నీకిస్తా పరుగులె మన తోవ
దగ్గరైపోతా నీ మనుసులొ మనసుగా
ఒగ్గుతా నా తనువును తపనలారగా
OK
No comments:
Post a Comment