Wednesday, February 3, 2021

OK

అపచారమే భవా నీ ఉనికిని ప్రశ్నిస్తే

కడుపాపమే హరా నిను నిరసిస్తే

దయ్యాలకు మాత్రం పీడించే శక్తులా

భూతాలకు సైతం వేధించే యుక్తులా

పరమాత్మవు నువులేక ప్రేతాత్మలుండునా

జగత్పితవు నీముందు పిశాచాలు మనునా


1.పూజించిన వేళలో వరములైతె ఈయవు

దూషించినంతనే శాపమేల ఇచ్చెదవు

గతజన్మల కర్మలంటు కట్టు కథలెందుకు చెప్పెదవు

జగత్కర్తవీవే కద తప్పు మాదేయని ఎలా నుడివెదవు

నీ నాటకాలలో బలిపశువులు మేమా

నీ కేళీవిలాసాలకు మేమాట బొమ్మలమా


2.దుష్టుమూక తాండవించ నీవొక జడుడివా

కష్టాలలొ మముద్రోయగ నీవూ దేవుడివా

దయ్యాలను శరణంటే కాస్తైనా కనికరించు

భూతాలను బతిమాలితె జాలైనా చూపించు

నిన్నే కదాశివా భూతనాథుడంటారు వృధాగా

నిన్నే సదాశివ వైద్యనాథుడంటారు అపప్రథగా

No comments: