రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
"ప్రేమికులరోజు" శుభాకాంక్షలతో-
*** *** ;*** *** *** ***
ప్రేమంటే చులకనా ప్రేమిస్తే పలచనా
అనుభూతించు ప్రేమని ఆస్వాదించు ప్రేమని
పంచిచూడు ప్రతివారికి ప్రేమని
ప్రేమించిచూడు కనీసం ఎవరో ఒకరిని
1. ఇముడ్చడం ఎందుకు ఏదో ఒక చట్రంలో ప్రేమని
గిరి గీయడమెందుకు అనంతమైన ప్రేమకి ఇంతే లెమ్మని
అంతకంటె మించిందే ఉంది ప్రేమకు పరమార్థం
అంతరంగాలే ఎరిగిన అద్భుతమౌ అంతరార్థం
2.ప్రేమంటే దైవానికి ఏకైక పరిపూర్ణ నిర్వచనం
ప్రేమంటే కాలాన్నే ఎదిరించే అపురూప విశ్వాసం
విశ్వజనీనమై విశ్వవ్యాప్తమై అవ్యక్తయై ప్రేమా
సార్వజనీనమై సృష్టిధర్మమై అనుభవైకవేద్యమై ప్రేమా
No comments:
Post a Comment