రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
దాచిన సొత్తు పైనే మక్కువ ఎవ్వరికైనా
మూసిన గుప్పిటి అంటే ఉత్సు కతెవ్వరికైనా
తేరగా పొందేదేదైనా పలుచనే పదుగురికీ
అందరాని అందాలంటేనే ఆసక్తి అందరికీ
1.ఒడుపుగా కట్టుకున్నకోక ఆకట్టుకొంటుంది
నిండుగా కప్పుకున్న పైటే కనికట్టు చేస్తుంది
అసూర్యం పశ్య సౌందర్యం వశపరచుకుంటుంది
అనాఛ్ఛాదిత ఉత్సేధమైతే వెగటు కొడుతుంది
2.అన్నులమిన్న కన్నులు చిలుకును సరస సరాగం
అభినవ మోహిని నవ్వులొలుకును రసమయ భావం
పాదాల పట్టీల మంజుల నాదం ఒక శృంగార వేదం
ఎలనాగ ఒళ్ళంతా పారేను వలరస జలపాతం
No comments:
Post a Comment