రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
సైగతొ రమ్మంటావు-మాటతొ పొమ్మంటావు
వస్తే జారుకుంటావు-పోతే జాలిగొంటావు
అదేంటో ప్రియతమా నీ వాలకం
నీ హృదయమయ్యిందా ఒక లోలకం
1.చేరువకాబోతే మూతివిరుపులు
దూరంగా జరిగితే వలపు పిలుపులు
కబురంపుతావు కపోతాలతో
కలలోన దూరుతావు వరమాలతో
అదేంటో ప్రియతమా నీ వైఖరి
అర్థమై చావదు నీదైన ఈ శైలి
2.వెళ్ళబోస్తావు నాతో నీ వేదనంతా
సాయపడగ వద్దంటావు ఇసుమంతా
వినకుంటే విసుగేల నీకు
మనసుకింక ముసుగేయకు
అదేంటో ప్రియతమా నీతత్వము
సాంత్వనకోసమేనా ప్రతి నేస్తము
No comments:
Post a Comment