Wednesday, February 10, 2021

 https://youtu.be/ryHd9sFXZSU


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పాలు నా లోపాలు- నీకె అందించెదరా

రోలు నా చిత్తము -నిను బంధించెదరా

వెన్ననే నా మనసు -ఇంక అపేక్షించరా

నా కన్నుల యమునవంక -విహరించరా

జగన్మోహన కృష్ణా -నను గ్రహించరా -అనుగ్రహించరా


1.వలువలు నా వాంఛలు సంగ్రహించరా

చిలువలు పలువలు వలపులు నిగ్రహించరా

కాళీయునివంటివి నా కామనలు మధించరా

కబళించే రిపులార్గురు తక్షణమే వధించరా

జగన్మోహన కృష్ణా నను గ్రహించరా అనుగ్రహించరా


2.గోవులు నా ఇంద్రియాలు పాలించరా

కుబ్జయే నా వక్ర బుద్ధి చేరి లాలించరా

రాధికగా ఎంచి నాతో రతి కేళించరా

సుధామునిగ భావించి నన్నుద్ధరించరా 

జగన్మోహన కృష్ణా నను గ్రహించరా అనుగ్రహించరా

No comments: