రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
అతను: వేచివేచి చూసే ఘడియ నిజమయ్యే దెన్నడో
ఆమె: ఎదిరిచూసి అలసిన మనసుకు ఊరట మరి ఎప్పుడో
అతను: ఎడబాటులోనా పెరిగేను ప్రేమా
ఆమె: విరహాల లోనా కాగేము కామా
అతను: కాలమా పరుగిడవే చెలిచెంత లేనివేళలందున
ఆమె: సమయమా కదలకుమా ప్రియుని కూడియున్న తరుణాన
1.అతను: ప్రతీక్షయే తీక్షణమైతే ప్రతీక్షణం అది ఒక శిక్ష
ఆమె: నిరీక్షణకు మోక్షం లేక అనుక్షణమో అగ్నిపరీక్ష
అతను: లక్ష్యపెట్టి ననుచేర పక్షిలాగ ఎగిరొచ్చి ఎదవాలు
ఆమె: నీ దక్షత చూపించి వశపరుచుకొ నా పరువాలు
అతను: కాలమా పరుగిడవే చెలిచెంత లేనివేళలందున
ఆమె: సమయమా కదలకుమా ప్రియునికూడియున్న తరుణాన
2.అతను: అర్థమే కాలేదు అందుబాటైనంత వరకు
ఆమె: వ్యర్థమై పోనీయకు దాచిన విలువైన నిక్కు
అతను: దారితప్పి పోమాకే మనసా రమించక
ఆమె: స్వర్గాన్ని చేరేదాకా శ్రమిద్దాం విరమించక
అతను: కాలమా పరుగిడవే చెలిచెంత లేనివేళలందున
ఆమె: సమయమా కదలకుమా ప్రియునికూడియున్న తరుణాన
No comments:
Post a Comment