రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
కలం సాగడం లేదు నువు వరించక
పదం పొసగడం లేదు సవరించక
నా స్ఫూర్తివి ఆర్తివి నువ్వే అది నువ్వే
కవితకు స్ఫురణ ప్రేరణ నువ్వే అదినువ్వే
కనిపించవేమే కనికరించవేమే
వివరమెరిగినాగానీ వరమీయవేమే
1.నన్ను పలకరించి ఎన్నాళ్ళైందో
మనసు పులకరించి ఎన్నేళ్ళైందో
నీకలా ఏమాత్రం అనిపించదా
ఎదసవ్వడి కాస్తైనా వినిపించదా
దేవతవే నీవంటే శిలలాగ మారాలా
గుండెనే అర్పిస్తే బండలాగ మార్చాలా
కనిపించవేమే కనికరించవేమే
వివరమెరిగినాగానీ వరమీయవేమే
2.మాటలతో మభ్యపెట్టీ నెగ్గగలరు మా'తలంతా
మౌనంతో ఉగ్గబెట్టీ గెలువగలరూ నెలతలంతా
క్రిందైనా మీదైనా చెలీ మీదేగా మాపై పైచేయి
ముందైనా వెనుకైనామీరే పడగొట్టే గడుగ్గాయి
కాళ్ళబేరాలే మీతో మాకు పరిపాటి
యోధానుయోధులైనా రాలేరు మీకు పోటి
కనిపించవేమే కనికరించవేమే
వివరమెరిగినాగానీ వరమీయవేమే
No comments:
Post a Comment