రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
పేరుకు మాత్రం మానవుడు
ప్రవర్తనకైతే పశు సమానుడు
పుణికిపుచ్చుకున్నాడు అవలక్షణాలను
ఆవుతోలుకప్పుకున్న పులిగుణాలను
1.నక్క వినయాలు నత్త నడకలు
కుక్కతోకవంకర బుద్ధులు కప్పదాటులు
గుడ్లగూబ చూపులు గబ్బిలంలా వ్రేలాడటాలు
నల్లికుట్ల చేష్టలు పిల్లిలా తోకముడవటాలు
2. ఎలుకలా దాగడాలు ఏనుగల్లె ఆగడాలు
వానపాము పౌరుషాలు కాకుల గోలలు
మేకపోతు గాంభీర్యాలు ఆంబోతు క్రౌర్యాలు
గొర్రెదాటు పోకడలు గంగిరెద్దు తల ఊపడాలు
No comments:
Post a Comment