మంజులవే మంజరివే మంజుల మంజరి నీవే
లాలసవే మదాలసవే సదా నా శ్వాసవు ధ్యాసవు నీవే
నాలో సరికొత్తగా మొలకెత్తే మధుర భావం నీవే
కలలోను తలపులలోను చెలఁగే అపురూప రూపం నీదే
1.పలురకాల విరులే విరిసే ఆమని నీవే
పలుకు తేనె వానలు కురిసే నందనవనివే
పలువరుసలొ తళుకులు మెరిసే మౌక్తిక హారానివే
పలువురు నీ సౌందర్యానికి పరవశించు అబ్బురానివే
2.హరి మోహినియై అనుకరించే నీ అందచందాల్ని
హరివిల్లే నీమేను వర్ణించలేను నేను నీ సోయగాన్ని
హరి వంటి కటి నీది నా పిడికిటిలో పట్టే పాటిది
హరి హరికి హరిణమవడవే నీ తనువుకు పరిపాటది
No comments:
Post a Comment