రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
ఊహలకు రూపం వస్తే-భావనకు ప్రాణం పోస్తే
నీలానే ఉంటుంది అచ్చంగా,మనసంతా హాయి వెచ్చంగా
సౌందర్యరాశివే,నా హృదయరాణివే
అందీయవే నీపాదం అందియనై అలరిస్తాగా
1.పదహారు ప్రాయాన-పరుగులెత్తు పరువాన
సంతరించుకున్నావే అపురూప అందాన్ని,
సౌందర్యరాశివే,నా హృదయరాణివే
నిను చూస్తేచాలు పొందగలము ఆనందాన్ని
2.వందసార్లు నే ఛస్తాను-వేయి జన్మలెత్తేస్తాను
నే నెదిరి చూస్తాను నీమదిని దోస్తాను
సౌందర్యరాశివే,నా హృదయరాణివే
నన్ను నమ్మవే చెలీ నూరేళ్ళూ తోడుగ వస్తాను
OK
No comments:
Post a Comment