రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:తిలక్కామోద్
అద్దంలో చూసుకో నిన్ను నీవు నిత్యం
మ్రొక్కేవు శ్రీదేవినే గాంచి ఇది సత్యం
ప్రత్యక్షమైనంతనే మది చేయునే నృత్యం
నీ సన్నిధి ప్రాప్తమైతే నా తపన కృతకృత్యం
ఎలాకీర్తించనూ నీ హృదయ ఔన్నత్యం
చేసుకో నీలో ఐక్యం ఇక జన్మరాహిత్యం
1.వరాలేమిమ్మనను నిన్ను మించి వరమేముంది
నోరు విప్పి ఏమి కోరను మైమరపు కమ్ముకుంది
కాలచక్రం అరిగిపోని తిరిగి తిరిగి అలుపే వచ్చి
నీనుండి దూరం చేయకు నీవంటే తరగని పిచ్చి
ఎలాకీర్తించనూ నీ హృదయ ఔన్నత్యం
చేసుకో నీలో ఐక్యం ఇక జన్మరాహిత్యం
2.నీ మాయలో పడిపోయా ఎరుగక నే అయోమయంగా
నీ మత్తులొ కూరుకపోయా సోయిలేక తన్మయంగా
అభావమై ముభావమై నా గొంతు మూగవోయెగా
నీవే మాయవై నేనే మాయమై బ్రహ్మానంద మాయెగా
ఎలాకీర్తించనూ నీ హృదయ ఔన్నత్యం
చేసుకో నీలో ఐక్యం ఇక జన్మరాహిత్యం
No comments:
Post a Comment