రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
ఏ పూవు చూసినా నీ మోమే కనిపిపిస్తోంది
చిరుగాలి తాకినా నీ స్పర్శే అనిపిస్తోంది
ఎంతగా నిండిపోయావే నా గుండెలోనా
వింతగా ఉండిపోయావే నా మెదడులోనా
1.చంద్రవంక వంక చూస్తే చిరునగవు నీదనిపించె
వాగు వంక ఏదెరొస్తే నీ నడుము వంపుగా తోచె
ఏ వంకా లేని పొంకమా నా వంక రావింకేలా
శంకలింక మొత్తం వదలి నా అంకము చేరవేలా
2.గుంభనంగ ఉంటావెందుకు తెలుపవే నీ గుట్టు
సంబురమా నన్నుడికించగ ఎందుకే నీకా బెట్టు
తిరుగుతూనే ఉంటానూ సూర్యకాంతినై నీ చుట్టూ
నిన్నంటి పెట్టుకునేలా నేనౌతా నీ నుదుటన బొట్టు
No comments:
Post a Comment