రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
వికృతంగ మారుతున్నాయి బర్త్ డే పార్టీలు
విషాదాంత మౌతున్నాయి జన్మదిన వేడుకలు
సరదాగా జరగాల్సినవి వినోదాన్ని కూర్చాల్సినవి
వెర్రిమొర్రివేషాలతో ప్రాణాంతకమౌతున్నాయి
హద్దుపద్దనేది లేక పెట్రేగుతున్నాయి
1.మరపురాని అనుభవంగ నిలవాల్సినవి
మధురమైన అనుభూతులనివ్వాల్సినవి
వింత వింత పోకడలతొ విసుగునొసగుతున్నాయి
లేటెస్ట్ ఫన్నంటూ లేకిగా తెగబడుతున్నాయి
బర్త్ డే బంప్స్ పేర బండబాదుడెందుకో
తినే కేకు మొకానికి పూసి నాకుడేమిటో
2.పుట్టిన రోజంటే ఒక పండగలా సాగాలి
అమ్మకు నాన్నకు మ్రొక్కి ఆశీస్సులు పొందాలి
కోవెలలో దైవాన్ని తప్పక దర్శించుకోవాలి
ఇంటి ఆడపడుచులతో హారతి పట్టించుకోవాలి
బంధుమిత్రులందరికీ మిఠాయిలను పంచాలి
దుష్ట వెస్టర్న్ కల్చర్ని డిస్ట్రాయ్ చేసేయాలి
No comments:
Post a Comment