రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
కథ కార్తీకదీపమైంది
కరోనా తిరిగి పుంజుకుంది
పెంచిపోషించినంత కాలం
దీపపు జ్వాలలొ మనమే శలభాలం
సమసి పోయేవరకు తప్పని సరి తగు జాగ్రత్తలు
అనివార్యం జీవితకాలం మన ముక్కున మాస్కులు
1.కొత్తకొత్త మలుపులతో చిర్రెత్తే మజిలీలతో
సాగే సాలీడు జిగురులా ఎడతెగనిదా వైనం
వింతవింత రూపాంతరాలతో వికృత దాడులతో
డెల్టా ఒమిక్రాన్ డెల్మిక్రాన్ కరోనా నామాలనేకం
సమసి పోయేవరకు తప్పని సరి తగు జాగ్రత్తలు
అనివార్యం జీవితకాలం మన ముక్కున మాస్కులు
2.మనుగడ కోసం ఇరువురి తీవ్ర పోరాటం
మనిషినే శాసించే కరోనాతో ఏల చెలగాటం
దొంగదెబ్బ తీయడానికి కాపుకాసింది కౄర కరోనా
ఏమరుపాటెపుడైనా చెల్లించాలి బ్రతుకనే జరిమానా
సమసి పోయేవరకు తప్పని సరి తగు జాగ్రత్తలు
అనివార్యం జీవితకాలం మన ముక్కున మాస్కులు
No comments:
Post a Comment