https://youtu.be/7mPXe2v85Bw
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:హరి కాంభోజి
నెమలికి ఇచ్చావు నాట్యము
పికముకు ఇచ్చావు గాత్రము
పిట్టకు సైతం ఇచ్చావు గ్రాసము
వరముగ ఇచ్చావు వాటికి స్వేచ్ఛా జీవితము
ప్రసాదించావు ముమ్మాటికి ఆనందమయ లోకము
ఏల స్వామీ నీకు ఏక పక్షము-పక్షివాహనా ఈ పక్షపాతము
1.నరసింహుడవై ప్రహ్లాదుని గాచినావు
రఘురాముడివై హనుమని బ్రోచినావు
ధర శ్రీ కృష్ణుడివై రాధని వలచినావు
శీతకన్ను వేసితివే నాపై వేంకటాచలపతి
నా రాతనిలా రాసితివే తిరుమల శ్రీపతి
ఏల స్వామీ నీకు ఏక పక్షము-పక్షివాహనా ఈ పక్షపాతము
2.త్యాగరాజు ఒసగినాడ ఏదైనా లంచము
అన్నమయ్య అందించిన దే బహుమానము
నాకైతే మాటలొ పాటలో నీతోడిదె ప్రపంచము
శిఖరము చేరేంతలొ లోయలోకి తోయాలా
తీరము దాపులొనె నావముంచి వేయాలా
ఏల స్వామీ నీకు ఏక పక్షము-పక్షివాహనా ఈ పక్షపాతము
No comments:
Post a Comment