https://youtu.be/z6UgpVAjaXM?si=uRz_HidvkbJfTNg6
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
కైలాసము నాకేల కైవల్యము నాకేల
కథలలో వినగనేల పరమశివా నీ లీల
ఉన్నట్టో లేనట్టో గమ్మునుంటె తెలియుటెలా
కదులు మెదులు ఎదలొ నీవె మా జీవ లయలా
కరుణామయుడవనే పేరుంటే అదిచాలా
కనికరించి దయకురియగ ఇంకా ఈ జాగేలా
1.పురాణాలు కావ్యాల ఎన్ని తార్కాణాలు
హరికథలు స్థలగాథల ఎన్ని నీ నిదర్శనాలు
అంతటా లింగాలు అడుగడుగున నీ గుళ్ళు
నామమాత్రమే కదా వెత దీర్చని దేవుళ్ళు
కరుణామయుడవనే పేరుంటే అదిచాలా
కనికరించి దయకురియగ ఇంకా ఈ జాగేలా
2.ప్రదోషకాల వ్రతాలు సంతతాభిషేకాలు
శివరాత్రి ఉపాసాలు జాగార ఉపాసనలు
హరహరమహాదేవ శంభోయను నినాదాలు
ఇవేకదా సదా శివా మేమేరిగిన వేదాలు
కరుణామయుడవనే పేరుంటే అదిచాలా
కనికరించి దయకురియగ ఇంకా ఈ జాగేలా
డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
మొబైల్:9849693324P
No comments:
Post a Comment