Saturday, August 27, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీవున్నదే నాకోసము నీలవర్ణదేహ

నీ పదములే నాకు సన్నిధి దివ్య సుందర విగ్రహ

తిరుమలేశ వేంకటేశ కలికల్మషనాశా

వరములు నీ అభయకరములు నాకిల జగదీశా


1.ఆడిస్తావు ఓడిస్తావు నా ఏడుపు వేడ్కగ చూస్తావు

ఓదారుస్తావు ఏమారుస్తావు మరలా బరిలోకి తోస్తావు

ఎగదోస్తావు పడవేస్తావు నా దీనత చోద్యంగా చూస్తావు

క్రీడిస్తా నలిగినా సరే నీ వినోదానికై

కేళిస్తా పొగలితేం సర్వదా నీ సరదాకై


2.గొప్పేనా స్వామీ ఎప్పుడూ నాపై నీవే నెగ్గితే

తప్పేంటి ప్రభూ ఓసారైనా నే గెలుపు వైపు మొగ్గితే

ఎలారక్తికడుతుంది ఏ ఆటైనా ప్రత్యర్థి ప్రతిభ తగ్గితే

నాకు నేర్పు గురువుగా ఆడే నేర్పరితనం

ఓటమికైనా బేలగా క్రుంగని తెంపరిగుణం

No comments: