https://youtu.be/pKDCzzXaeHg
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
ఆత్మీయ కవనం
అనురాగ గానం
కలబోసినదీ ఆనందవనం
చేయి సాచినదీ అనుబంధ జీవనం
కరిగిపోనీకు నేస్తమా ఏ క్షణం ఈ దినం
1.ఉద్వేగాలు లేవు ఉద్రేకాలు… ఉత్సాహాలే
ఉన్మత్తతలు రావు ఉద్విగ్నతలు…సలహాలే
అసూయా ద్వేషాలకు లేదు తావు…స్నేహాలే
చేయి సాచినదీ అనుబంధ జీవనం
కరిగిపోనీకు నేస్తమా ఏ క్షణం ఈ దినం
2.మకరందం పాటే మాధుర్యం…వీనులకు
సాహిత్యం తోపాటే సంగీతం…అభిమానులకు
గానం బహుమానం పొరపాటే మౌనం…గాయక గాయనీమణులకు
చేయి సాచినదీ అనుబంధ జీవనం
కరిగిపోనీకు నేస్తమా ఏ క్షణం ఈ దినం
No comments:
Post a Comment