https://youtu.be/0DJMR8dLtng
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
ఏ అర్థం తీసుకున్నా కోమలమే నీ గాత్రం
ఎలా పరిగణించినా ఆహ్లాదమె నీ హాసం
నడకల జలపాతానివి పలుకుల పారిజాతానివి
మొత్తంగా నువ్వే ఇంద్రజాలనివి
చిత్తాన్నేదో చేసే వర్ణ చిత్రానివి
1.కేంద్రకాన సాంధ్రమైన సూర్య గోళానివి
గ్రహగతుల గతిపట్టించే గుండెల కళ్ళానివి
మతికి స్థిమితం దూరంచేసే గందరగోళానివి
బ్రతుకు నతలాకుతలం చేసే వేళాకోళానివి
మొత్తంగా నువ్వే ఇంద్రజాలనివి
చిత్తాన్నేదో చేసే వర్ణ చిత్రానివి
2.తళుకులీను తారలైనా నీ చంద్రకళా ప్రీతులు
కలలుకనే చకోరాలూ తనూ చంద్రికా తప్తులు
కార్తీక కౌముది నీ కౌగిలికీ కారు యతులతీతులు
ఆ రతీ భారతీ నీతో తులతూగక ఎత్తారు చేతులు
మొత్తంగా నువ్వే ఇంద్రజాలనివి
చిత్తాన్నేదో చేసే వర్ణ చిత్రానివి
No comments:
Post a Comment